యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సోషియో ఫాంటసీ డ్రామా కథని సిద్ధం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా… ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ తర్వాత, దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ తో సినిమా ఉంది… ఎన్టీఆర్ కి వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. వార్ 2కి తక్కువ డేట్స్ అవసర పడతాయి కాబట్టి ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ వచ్చే ఫుల్ లెంగ్త్ సినిమా అంటే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. అయితే సలార్ 2 లేట్ గా స్టార్ట్ అవ్వాల్సింది ఇమ్మిడియట్ గా స్టార్ట్ అవుతుండడంతో 2025 మిడ్ వరకు ప్రశాంత్ నీల్ ఫ్రీ అయ్యే అవకాశం కనిపించట్లేదు.
ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఎన్టీఆర్ కనిపించట్లేదు. సలార్ 2 కంప్లీట్ అయ్యే లోపు త్రివిక్రమ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా మేలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ కి రిలీజ్ అయ్యింది అంటే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఎంత ఫాస్ట్ గా సినిమా చేస్తారు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇదే పేస్ లో ఒక సాలిడ్ రీజనల్ సినిమా చేసినా… 2025 మిడ్ వరకు టైమ్ ఉంది కాబట్టి ఏడాదిన్నర సమయాన్ని వాడుకుంటూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఒక పాన్ ఇండియా సినిమా చేసినా హిట్ కొట్టడం మాత్రం గ్యారెంటీ. మరి ఈ కాంబినేషన్ నీల్ సినిమా స్టార్ట్ అయ్యే లోపు ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారో లేదో చూడాలి.