NTV Telugu Site icon

Prabhas: తిరుపతిలోనే నా పెళ్లి.. కృతిని చూసాక..

Prabhass

Prabhass

Prabhas: ఆదిపురుష్ కోసం తాము చాలా కష్టపడ్డామని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. నేడు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఈవెంట్ లో ప్రభాస్ చాలా ఎక్కువసేపు మాట్లాడి షాక్ ఇచ్చాడు. సాధారణంగా అయితే ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు. అయితే ప్రతిసారి అభిమానులు ఎక్కువసేపు మాట్లాడాలని కోరుతుండగా.. ఈసారి ఎక్కువసేపు మాట్లాడి వారిని ఆనందపరిచాడు. ఇక ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ.. ” ఆదిపురుష్ సినిమా మేము చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు. ట్రైలర్ మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఓం రౌత్ నే ట్రైలర్ ను అభిమానుల మధ్యనే రిలీజ్ చేయాలనీ చెప్పాడు. అప్పుడు నేను ఒకసారి మా ఫ్యాన్స్ కు 3డీలో వేసి చూపించమన్నాను. మీ అందరికీ నచ్చింది అంటే ఓపెనింగ్ కలక్షన్స్ అదిరిపోతాయి. ఓం రౌత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తిండి, నిద్ర, కుటుంబం మొత్తం వదిలేసి ఏడు నెలలు శ్రమించాడు. సినిమా కోసం టీమ్‌ మొత్తం రోజుకు దాదాపు 20 గంటలు కష్టపడ్డారు.. ఓం రావత్‌ ఓ యుద్ధమే చేశాడు.. నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు.. ఆదిపురుష్‌ చేయడం మా అదృష్టం.

Kriti Sanon: ప్రభాస్ మీరు అనుకున్నంత కామ్ ఏం కాదు..

ఇక నన్ను..రామయణం చేస్తున్నావా? అని చిరంజీవి గారు అడిగారు.. అవును అని చెప్పాను. అలాంటి అదృష్టం చాలాతక్కువమందికి దొరుకుతుంది. నీ అదృష్టంగా భావించు అని అన్నారు. నిజంగా ఈ సినిమా దొరకడం నా అదృష్టం. ఇక ఈ సినిమాలో జానకిమా గా నటించిన కృతి.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ అలా సీతగా కూర్చొని కంటినుంచి కన్నీళ్లు పెట్టుకున్న ఆ లుక్ చూసి.. కృతితో అన్నాను ఏం ఎక్స్ ప్రెషన్ అమ్మా ఇది.. అసలు ఒక్క ఎక్స్ ప్రెషన్ తో సీతమ్మ అని అందరి చేత అనిపించుకుంది. సీత క్యారెక్టర్ కోసం చాలా సెర్చ్ చేశారు. ఏ హీరోయిన్ కు అయితే మంచి పేరు ఉందో .. మంచి అమ్మాయి.. ఆ అమ్మాయే కృతి. ఇక సినిమాలో నటించిన లక్ష్మణుడు, హనుమంతుడు.. వారు లేకపోతే ఆదిపురుష్ లేదు. మాములు దానికంటే ఎక్కువ మాట్లాడాను.. ఏడాదికి రెండు సినిమాలు చేస్తా.. కొంచెం మాట్లాడుతా.. సంవత్సరానికి మూడు సినిమాలు కూడా రావొచ్చు.. స్టేజ్‌పై తక్కువ మాట్లాడి.. ఎక్కువ సినిమాలు చేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మధ్యలో ఫ్యాన్స్ ప్రభాస్ పెళ్లి గురించి అడుగగా.. ప్రభాస్ ఖచ్చితంగా నేను ఇక్కడే చేసుకుంటా.. నా పెళ్లి తిరుపతిలోనే.. త్వరలో అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేశారు.