సలార్… సుల్తాన్ ఏం అడిగినా ఇచ్చే వాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసే వాడు. ది కమాండర్ సలార్ గా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్ పుట్ ఈరేంజులో ఉంటుందా అనిపించేలా చేసాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస్తాడు. దేవా కాస్త సైలెంట్, కొంచెం వయొలెంట్. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ప్రభాస్ దేవా నుంచి ఇంకో వ్యక్తిగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూపించడానికి, అతని నిజ స్వరూపాన్ని చూపించడానికి ప్రశాంత్ నీల్ చేసిన సెటప్ అని ఆ సీన్ స్టేజింగ్ అన్ లిమిటెడ్ పూనకాలు తెప్పిస్తాడు. పృథ్వీరాజ్, ప్రభాస్ దగ్గరికి వచ్చి దేవా అని పిలిచిన దగ్గర నుంచి… ప్రభాస్ పూర్తి పేరు దేవరథ అని రివీల్ చేసే వరకూ వచ్చే సీక్వెన్స్ కి ఫిదా అవ్వాల్సిందే. ట్రైలర్ లో ప్రభాస్ నిలబడితే వెనక కత్తులు పడిపోయే షాట్ ప్రతి ఒక్కరికీ నచ్చి ఉంటుంది.
ఇదే షాట్ థియేటర్ లో వచ్చే సమయానికి అందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అమ్మోరు రాలేదు అందుకే ఆమె కొడుకుని పంపించింది అనే డైలాగ్ పడగానే ఒళ్ళు జలదరిస్తది. ఆ రేంజ్ సీన్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఈ సమయంలో ఆన్ స్క్రీన్ కనిపించేవి, సౌండ్ బాక్సుల నుంచి వినిపించేవి… అన్నీ అద్భుతాలే. దేవా… దేవరథగా మారే ఆ ఒక్క సీన్ టికెట్ వర్త్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఒక్క సీన్ గురించే మాట్లాడుతున్నారు అంటే థియేటర్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇది పూర్తి స్థాయి పీక్స్ కి చేరిన కమర్షియల్ సినిమా.