టాలీవుడ్‌లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల ఉదార స్వభావం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమాల్లోకి కేవలం హీరోయిజం చూపించడం మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ సామాజిక సేవకు ముందుకు వస్తారు. తాజాగా ప్రభాస్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ అభిమాని పెదవుల్లో చిరునవ్వులు పూయించారు.
Read Also : తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున!
ప్రభాస్ చాలా మంచి పనులు చేస్తాడు. కానీ వాటి గురించి ప్రచారం చేసుకోవడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడడు. అందుకే ఆయన చేస్తున్న సేవ గురించి పెద్దగా చర్చకు రాదు. ఇక విషయంలోకి వస్తే సెప్టెంబర్ 16 న టెర్మినల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన డై-హార్డ్ ఫ్యాన్ కు ప్రభాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ అభిమానిని వీడియో కాల్ ద్వారా పరామర్శించాడు. దీంతో ఆ క్యాన్సర్ పేషేంట్ చాలా సంతోషించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి, అతని పట్ల ఆమెకున్న అభిమానాన్ని తెలుసుకున్న ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో ఆమెకు కొంత సమయం ఆమె కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో కూడా ప్రభాస్ “మిర్చి” సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు, భీమవరంలో మృత్యువుకు దగ్గరవుతున్న తన 20 ఏళ్ల అభిమానిని ఇలాగే ఆశ్చర్యపరిచాడు. ప్రభాస్‌ను చూసిన తర్వాత బాలుడు 20 రోజులకు పైగా జీవించాడని అతని తండ్రి మీడియా చెప్పారు.