NTV Telugu Site icon

Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్, గోపీచంద్

Unstopable

Unstopable

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ కలవనున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బయట షోస్ కి పెద్దగా రాడు అలాంటిది ‘అన్ స్టాపపబుల్ షో’కి వస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే రెబల్ స్టార్ ఫాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తో పాటు అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ కూడా బాలయ్య టాక్ షోకి రానున్నాడు. ఈ ఇద్దరు హీరోలు చాలా మంది ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే.

వర్షం సినిమా నుంచి ప్రభాస్ గోపీచంద్ మంది ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుంచి ఇద్దరు కలిసి నటించలేదు కానీ గోపీచంద్ నటించిన  చాలా సినిమాలని ప్రమోట్ చేశాడు. ఆరు అడుగుల హైట్ తో భారి కటౌట్స్ లా ఉండే ప్రభాస్, గోపీచంద్ ల స్నేహం గురించి ఇంటరెస్టింగ్ విశేషాలని ఈ ఎపిసోడ్ లో ఆడియన్స్ తో పంచుకోబోతున్నారట. న్యూ ఇయర్ రోజున టెలికాస్ట్ అవనున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ని డిసెంబర్ 11న షూట్ చేయబోతున్నారు. ఆ రోజు మేకింగ్ ఫోటోస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో చాలా  మంది హీరోలు టాక్ షోస్ ని హోస్ట్ చేశారు. రానా అయితే టాక్ షోస్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ప్రభాస్ కి ఎంతో క్లోజ్ అయిన రానా చేస్తున్న షోకి ప్రభాస్ వెళ్లలేదు. అలాంటిది బాలయ్య షోకి వస్తున్నాడు అనగానే న్యూ ఇయర్ కి గిఫ్ట్ ఇస్తున్నందుకు ‘థాంక్స్ ఆహా’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా అరుదుగా కనిపించే కలయికలో ఒకే వేదికపై చూపించబోయే ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని ఏ రేంజులో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

Show comments