Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్, గోపీచంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ కలవనున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ బయట షోస్ కి పెద్దగా రాడు అలాంటిది ‘అన్ స్టాపపబుల్ షో’కి వస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే రెబల్ స్టార్ ఫాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ తో పాటు అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ కూడా బాలయ్య టాక్ షోకి రానున్నాడు. ఈ ఇద్దరు హీరోలు చాలా మంది ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే.
వర్షం సినిమా నుంచి ప్రభాస్ గోపీచంద్ మంది ఫ్రెండ్స్ అయ్యారు. అప్పటినుంచి ఇద్దరు కలిసి నటించలేదు కానీ గోపీచంద్ నటించిన చాలా సినిమాలని ప్రమోట్ చేశాడు. ఆరు అడుగుల హైట్ తో భారి కటౌట్స్ లా ఉండే ప్రభాస్, గోపీచంద్ ల స్నేహం గురించి ఇంటరెస్టింగ్ విశేషాలని ఈ ఎపిసోడ్ లో ఆడియన్స్ తో పంచుకోబోతున్నారట. న్యూ ఇయర్ రోజున టెలికాస్ట్ అవనున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ని డిసెంబర్ 11న షూట్ చేయబోతున్నారు. ఆ రోజు మేకింగ్ ఫోటోస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో చాలా మంది హీరోలు టాక్ షోస్ ని హోస్ట్ చేశారు. రానా అయితే టాక్ షోస్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ప్రభాస్ కి ఎంతో క్లోజ్ అయిన రానా చేస్తున్న షోకి ప్రభాస్ వెళ్లలేదు. అలాంటిది బాలయ్య షోకి వస్తున్నాడు అనగానే న్యూ ఇయర్ కి గిఫ్ట్ ఇస్తున్నందుకు ‘థాంక్స్ ఆహా’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా అరుదుగా కనిపించే కలయికలో ఒకే వేదికపై చూపించబోయే ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని ఏ రేంజులో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!