ఆదిపురుష్ మేకర్స్‌ను భయపెడుతునే ఉన్నారు నెటిజన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ ఇదేం గ్రాఫిక్స్.. దీని కోసం 600 కోట్లు ఖర్చు చేస్తున్నావా? అంటూ మండి పడ్డారు. అయితే ఆదిపురుష్ ట్రైలర్ మాత్రం విమర్శలకు చెక్ పెట్టింది. ఇందులో కొన్ని మిస్టేక్స్‌ను ఎత్తి చూపినా.. ట్రైలర్ బాగుండడంతో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఎవరూ పెద్దగా కామెంట్స్ చెయ్యలేదు. ట్రేడ్ వర్గాల నెల రోజుల ముందు నుంచే ఆదిపురుష్ డే వన్ ఓపెనింగ్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు అంటే ఆదిపురుష్ ట్రైలర్ మహిమే. అయితే రీసెంట్‌గా వచ్చిన ఒక్క పోస్టర్ మళ్లీ ఆదిపురుష్‌ను ట్రోలింగ్ ఫేస్ చేసేలా చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ఉందంటూ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో గాల్లో ఎగురుతున్న హనుమాన్ పై రాముడు బాణం వేస్తున్నట్టుగా చూపించారు. ఈ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను హుషారెత్తించింది. అయితే మామూలుగా ఈ పోస్టర్‌ను చూస్తే.. ఎలాంటి డౌట్స్ రావు కానీ ఒక్కసారి తీరిగ్గా గమనిస్తే.. కరెక్ట్‌గా హనుమంతుడి తల దగ్గర బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి.
ఇది చాలు ఆదిపురుష్‌ని ఆడుకోవడానికి అన్నట్టు.. రామాయణ కాలంలో అంత ఎత్తైన భవనాలు ఉన్నాయా? అంటూ మళ్లీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఈ పోస్టర్‌ను జూమ్ చేసి మరీ.. బిల్డింగ్స్‌ను హైలెట్ చేసి.. రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆధునిక రామాయణం అని ఒకరంటే.. కాదు కాదు హాలీవుడ్ సినిమా పోస్టర్‌ని కాపీ చేసి ఎడిట్ చేయడం మర్చిపోయారంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క పోస్టర్‌తో మళ్లీ ఆదిపురుష్ హాట్ టాపిక్‌గా మారింది. అందరికీ తెలిసిన రామాయాణం గురించి.. అసలు ఓం రౌత్ ఏం చెప్పబోతున్నాడనేది అంతు పట్టకుండా పోయింది. ఎంత ఆధునిక రామాయణం అయినా.. ఇలాంటి పోస్టర్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిస్తున్నాయి. మరి జూన్ 16న వస్తున్న ఆదిపురుష్ ఏం చేస్తుందో చూడాలి.
मंगलमय हर भक्त होगा,
जब आदिपुरुष का स्वागत होगा। 🙏The devotion of everyone abounds,
As Adipurush's arrival resounds 🙏One month to go!
Jai Shri Ram
जय श्री राम
జై శ్రీరాం
ஜெய் ஸ்ரீ ராம்
ಜೈಶ್ರೀರಾಂ
ജയ് ശ്രീറാം#Adipurush in cinemas worldwide on 16th June! ✨ #Prabhas pic.twitter.com/IBnNYzmHbf— UV Creations (@UV_Creations) May 16, 2023