Power Star VS Young Tiger: ఆయన క్లాస్.. ఈయన మాస్.. డైరెక్టర్లకు దండం పెట్టినా తప్పులేదురా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power Star VS Young Tiger: సాధారణంగా అభిమానులు.. తమ హీరోలు ఇలా ఉండాలి అని అంచనాలు వేసుకుంటూ ఉంటారు. మాస్ గా, క్లాస్ గా ఉండాలని డైరెక్టర్లకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య హీరోల ఫ్యాన్సే డైరెక్టర్లుగా మారుతున్నారు. ప్రస్తుతం హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే డైరెక్టర్లు అంచనాలను పెంచేస్తున్నారు. ఇక గత వారం నుంచి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ గురించి, టైటిల్స్ గురించే నెట్టింట చర్చ జరుగుతుంది. వారే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్. ఈ స్టార్ హీరోల సినిమాల టైటిల్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, బ్రో.. ఈ సినిమాలు అన్నింటిని పవన్ శరవేగంగా పూర్తి చేయడానికి రెడీ అయిపోయాడు. ఇక నిన్ననే పవన్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. బ్రో అనే క్లాస్ టైటిల్ తో పవన్ క్లాస్ గాడ్ గా ప్రత్యక్షమయ్యాడు. ఈ చిత్రంలో పవన్ టైమ్ గా కనిపించనున్నాడు. ఇక కాల భైరవుడు వెనుక ఉండగా.. పై నుంచి దిగివచ్చిన స్టైలిష్ గాడ్ గా పవన్ ను చూపించాడు డైరెక్టర్ సముతిర ఖని. పవన్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఉస్తాద్ లో పవన్ మాస్ లుక్ ను చూసి క్లాస్ గా ఎప్పుడు కనిపిస్తాడా..? అనుకొనేలోపు బ్రో లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఫిదా చేసేశాడు.
Bichhagadu 2: ఈ బిచ్చగాడు హిట్ కొట్టేశాడమ్మా..?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక పవన్ క్లాస్ లుక్ వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు.. ఎన్టీఆర్ మాస్ అవతార్ లో దూసుకొచ్చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సముద్ర వీరుడుగా కనిపించనున్నాడు. ఇక రేపు ఎన్టీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని కొద్దిసేపటి క్రితమే దేవర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎగిసిపడే అలల మధ్య.. రక్తంతో నిండిన శవాల మధ్య చేతిల ఈటె పట్టుకొని భయానికే మీనింగ్ తెలియనివాడిలా కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన ఎన్టీఆర్ లుక్స్ ఒక ఎత్తు.. ఇది ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అభిమానులు చొక్కాలు చింపుకొని థియేటర్ లో రచ్చ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఎన్టీఆర్ ను జనతా గ్యారేజ్ లో క్లాస్ గా చూపించిన కొరటాల.. దేవర లో ఇంత ఊర మాస్ గా చూపిస్తాడని అభిమానులు కూడా అనుకోని ఉండరు. ఇక ఈ రెండు పోస్టర్స్.. ట్విట్టర్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన క్లాస్.. ఈయన మాస్.. అభిమానుల కోరికకు తగట్టు డైరెక్టర్లు వారి హీరోలను చూపించడంతో.. డైరెక్టర్లకు దండం పెట్టినా తప్పులేదురా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఈ స్టార్లు సినిమాలో ఎలా అదరగొడతారో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!