పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా చిత్రం బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
గత రాత్రి జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ భారీ ఎత్తున రిలీజ్ తరలివచ్చారు. దాదాపు మూడేళ్లు పవర్ స్టార్ తన సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడి. అప్పట్లో వచ్చిన బ్రో తర్వాత పవర్ స్టార్ పొలిటికల్ రీజన్స్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు కోసం పవర్ స్టార్ సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. తనదైన స్పీచ్ లతో అదరగొడుతున్నారు. ఒకవైపు సినిమా గురించి చెప్తూనే మరోవైపు తన ఫ్యాన్స్ లో జోష్ నింపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ మూడేళ్ళ ఆకలిని ఒక్క స్పీచ్ తో తీర్చేసాడు. మాకు కావాల్సిందే కదా సేనాని అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్ స్పీచ్ వీడియోస్ తో హల్ చల్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు రికార్డ్ స్థాయి ఓపెనింగ్ రాబట్టే ఉంది.