ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కాపు సంక్షేమసేన ఆధ్వర్యంలో బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతో పాటు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, నిర్మాత అడ్డాల చంటి, రత్నం, రాఘవేంద్ర రెడ్డి, గంగయ్య నాయుడు, విఠల్, ఎంవి రావ్, చందు జనార్దన్, నిర్మాత వానపల్లి బాబురావు, వడ్డీ సుబ్బారావు, దర్శకుడు రాజేంద్ర కుమార్, రణ్వీర్ సాయి చంద్, ప్రభాకర్, శ్రీనివాస్, చేరగడ్డ శ్రీనాథ్, కెవి రమణమూర్తి, పద్మజ లక్ష్మి, శ్యామ్, సత్యనారాయణ, సురేష్ కొండేటి, ముత్యాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై ఎం ఎచ్ రావు కేక్ కట్ చేశారు.
అనంతరం హరిరామ జోగయ్య మాట్లాడుతూ, ”కాపు సంక్షేమ సేవ ఏర్పడి సంవత్సర కాలం దాటింది. ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఏ రాజకీయ పార్టీతో కానీ, ఏ కులానికి గాని వ్యతిరేకం కాదు. కేవలం కాపు కులస్తుల సంక్షేమం కోరుతూ ముందుకు నడుస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే. అయితే ఈ సంస్థకంటూ రాజకీయ సిద్ధాంతం ఉంది. రాజకీయంగా ఎదుగుతున్న కాపు నాయకులు ఎవరైనా, ఏ పార్టీ వారు అయినా వారిని బలపరచడం ద్వారా ప్రోత్సహించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. జనసేన పార్టీని స్థాపించి , ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాజ్యాధికారం దక్కించుకునే దిశగా కాపులతో పాటు బిసి లను, ఎస్సి లను, ఎస్టీలు, మైనార్టీ వర్గాలను కలుపుకుంటూ ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్నారు పవన్ కళ్యాణ్” అని అన్నారు. కాపు సంక్షేమ సేన సమర్పణలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. తిరుమలరావు నిర్మాతగా, ప్రముఖ సినీ రచయిత రాజేంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందించిన ‘మేమే’ లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ప్రదర్శించారు.
Also Read
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!