టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. వారం కిందట మిస్ అయిన ఆయన ఊహించని విధంగా గురువారం బెంగుళూరు రైల్వే ట్రాక్ ఫై మృతదేహంగా కనిపించారు. శవం వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి అయన ఏకే రావు అని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం తన తండ్రిదే అని ఏకే రావు చిన్న కూతురు షాలినిరావు నిర్దారించడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.
వారం రోజుల క్రితం ఏకే రావు పంజాగుట్టలోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నానని చెప్పి హడావిడిగా వెళ్లి గురువారం శవంగా కనిపించారు. ఈ వారం రోజులు కూడా సింగర్ హరిణి కుటుంబం కూడా కనిపించకుండా పోయింది. అదేంటో ముందే తెలిసినట్లు మళ్లీ తండ్రి శవం కనిపించాకే ఆ కుటుంబం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.. చేతిపై, మెడపై కత్తిగాట్లు ఉండడంతో ఇది ఖచ్చితంగా హత్యేనని, ఎవరో తెలిసినవాళ్లే హత్య చేసి రైల్వే ట్రాక్ పడేసి ఉంటారని అనుమానిస్తున్న తరుణంలో ఏకే రావు పోస్ట్ మార్టం రిపోర్ట్ మరో సంచలనాన్ని క్రియేట్ చేసింది.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఏకే రావుది ఆత్మహత్య అని తేలింది. ఆయనది హత్య కాదని, ఆయనే ఆత్మహత్యకు పాల్పడినట్లు రిఫార్ పేర్కొంది. దీంతో ఈ మిస్టరీ వీడింది. అయితే ఆయన హుటాహుటిన బెంగుళూరు ఎందుకు వెళ్లారు..? చేతిపై , మెడపై కత్తి గాట్లు ఎలా వచ్చాయి..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇకపోతే ఏకే రావు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరికి చెందిన ఎన్జీవోకు సీఈవోగా.. సుజనా కంపెనీలకు లీగల్ అడ్వైజర్ గా పనిచేశారు.