ధనుష్ అనే ఒక వ్యక్తిని హీరోగా చూడడమే కష్టం అనే దగ్గర నుంచి వీడురా హీరో అంటే అనిపించే స్థాయికి ఎదిగిన విధానం ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. హీరో అవ్వాలి అనుకునే వాళ్ళకే కాదు ఒక డ్రీమ్ ని అచీవ్ చెయ్యాలి అనుకునే వాళ్ళందరికీ ధనుష్ నిజంగానే ఇన్స్పిరేషన్. తమిళనాడు నుంచి ఇప్పుడు సూర్య, కార్తి, విజయ్, విక్రమ్ లాంటి హీరోలు తెలుగు మార్కెట్ కోసం బైలింగ్వల్ సినిమాలు చేస్తున్నారు కానీ మూడు దశాబ్దాల క్రితమే రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలకి పాన్ ఇండియా ఇమేజ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదే ఇంజే ని మైంటైన్ చేస్తున్నాడు ధనుష్. తమిళనాడులో మోస్ట్ టాలెంటెడ్ హీరో అనే పేరు తెచ్చుకోని కెరీర్ నిలబెట్టుకున్న ధనుష్, రెండు సార్లు నేషనల్ అవార్డ్ ని గెలుచుకున్నాడు అంటే ఒక నటుడిగా అతను ఎంత ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు. నార్త్ లో కూడా తన మార్క్ ని చూపించిన ధనుష్, ‘ఆనంద్ ఎల్.రాయ్’ లాంటి డైరెక్టర్ కి మోస్ట్ ఫేవరేట్ హీరో అంటే హిందీలో కూడా ధనుష్ ఇంపాక్ట్ ఎంతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
రుస్సో బ్రదర్స్ లాంటి ఫిల్మ్ మేకర్స్, ‘గ్రే మ్యాన్’ సినిమా చేసి అందులో ఒక ఇండియన్ హీరోని కాస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు… ఇండియాలో యాక్షన్ సినిమాలు చెయ్యడానికి ఆరున్నర అడుగుల సిక్స్ ప్యాక్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారందరినీ కాదని రుస్సో బ్రదర్స్ ధనుష్ ని కాస్ట్ చేశారు. అలా ధనుష్ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేశాడు. తన మార్కెట్ బౌండరీస్ ని చెరిపేస్తున్న ధనుష్, తెలుగులోకి కూడా ఎంటర్ అవుతూ ‘సార్’ సినిమా చేశాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ధనుష్ నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ‘సార్’ సినిమా ప్రీమియర్స్ నుంచి, మార్నింగ్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ధనుష్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుగు ఆడియన్స్ స్పెషల్ మెన్షన్ చేస్తున్నారు. స్ప్రెడ్ అవుతున్న పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ చూస్తుంటే ధనుష్ కి తెలుగులో సాలిడ్ లాంచ్ దొరికేసినట్లు ఉంది. ఇదే జోష్ లో ధనుష్ ఫ్యూచర్ సినిమాలని కూడా బైలింగ్వల్, పాన్ ఇండియా ఉండేలా చూసుకుంటే చాలు టాలీవుడ్ లో ధనుష్ మార్కెట్ కి ఒక స్టాండర్డ్ వచ్చినట్లే.