Padmaja Raju: అందాల నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padmaja Raju:ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.
పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా “గోకులంలో సీత, తొలిప్రేమ” వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకాన్ని నటశేఖర కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పద్మజా రాజు ‘ఎన్.టి.వి- ఎంటర్ టైన్ మెంట్’తోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే యేడాది తన తనయుణ్ణి నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. రేపు ఉదయం మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరి, జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!