Poonam Pandey: పూనమ్ పాండే.. పూనమ్ పాండే.. ఉదయం నుంచి ఆమె మృతి వార్త దేశాన్ని మొత్తం షేక్ చేస్తుంది. పూనమ్ పాండే ఫిబ్రవరి 1న గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె మేనేజర్ ధృవీకరించారు. సోషల్ మీడియా ట్రెండ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. 32 వయస్సు ఉన్న పూనమ్.. ఇలా సడెన్ గా మృతి చెందింది అనే వార్తను సగానికి పైగా ప్రజలు నమ్మలేకపోతున్నారు. దీంతో పూనమ్ మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. పూనమ్ పాండే.. ఒక నటి. ఆమె మరణించింది అని తెలిసిన వెంటనే.. వారి ఇంటికి ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటిలు రావడం.. ట్విట్టర్ ద్వారా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం ఏది లేదు. అసలు ఎక్కువ అనుమానించే విషయం ఏంటంటే.. ఆమె కుటుంబం ఆమె మృతిపై మౌనంగా ఉండడం. ఎన్ని గొడవలు అయినా కూడా ఇంట్లో కుటుంబ సభ్యురాలు మృతి చెందింది అంటే బాధ కచ్చితంగా ఉంటుంది. కానీ. పూనమ్ సోదరి ఇంటివద్ద అలాంటిందేమీ కనిపించలేదని పూనమ్ బాడీ గార్డ్ చెప్పుకొస్తున్నాడు. ఉదయం నుంచి పూనమ్ సోదరికి ఫోన్ చేస్తున్నా ఆన్సర్ చేయడం లేదని అతడు చెప్పుకొచ్చాడు.
ఇక ఈ క్యాన్సర్ విషయానికొస్తే.. ముందు వెనుక పూనమ్ కెరీర్ లో ఆమె హాస్పిటల్ కు వెళ్లినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ క్యాన్సర్ విషయం బయటపడితే.. ఆమె ట్రీట్ మెంట్ తీసుకోకుండా ఇప్పటివరకు ఎందుకు ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో.. క్యాన్సర్ ను గుర్తించలేని స్థితిలో పూనమ్ ఉంది అంటే నమ్మలేకపోతున్నామని కొందరు చెప్పుకొస్తున్నారు. అసలు ఇవన్నీ కాదు.. పూనమ్ చనిపోతే ఆమె పార్దీవ దేహాన్ని మీడియాకు చూపించడానికి ఎందుకు సంకోచిస్తున్నారు.. ? అసలు ఆమె నిజంగా చనిపోయిందా.. ? లేక చంపేశారా.. ? దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే ఈ క్యాన్సర్ పేరు చెప్తున్నారా.. ? అనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. లేకపోతే ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారా.. ? నిజంగా పూనమ్ మృతిచెందినట్లు అయితే.. ఆమె సోదరి కానీ, ఆమె తల్లి కానీ, ఆమె మాజీ భర్త కానీ మీడియా ముందుకు వచ్చి కన్ఫర్మ్ చేసింది లేదు. ఇక మేనేజర్ ను నిలదీస్తే.. పూనమ్ సోదరినే ఉదయం తనకు కాల్ చేసి పూనమ్ మృతిచెందింది.. పోస్ట్ పెట్టమని చెప్పినట్లు తెలిపాడు. అసలు పూనమ్ ఇంట్లో ఏం జరుగుతుంది .. ? వారందరూ ఏం దాస్తున్నారు.. ? అనేది పెద్ద మిస్టరీగా మారింది. మరి ఈ నిజాలు బయటకు రావాలంటే రేపటివరకు ఆగాల్సిందే.