Site icon NTV Telugu

Pooja Hegde: విజయ్ అలాంటి పని చేస్తాడనుకోలేదు.. ఒక్కసారిగా షాక్ అయ్యా

Pooja Hegde

Pooja Hegde

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు  రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. విజయ్ తో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది.. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఇక బుట్ట బొమ్మ తర్వాత ఈ సినిమాలోని ‘అరబిక్‌ కుత్తు’ పాట నన్ను ఎంతో  పాపులర్‌ చేసింది. ఇక విజయ్ గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్.. చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. పని పట్ల చూపించే అంకితభావం, కష్టపడేతత్వం నాలో స్ఫూర్తి నింపాయి. ఇక నా బర్త్‌డేకు విజయ్‌ ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. నాకు తెలియకుండా సర్‌ప్రైజ్‌గా ప్లాన్‌ చేశారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఆయన అలా చేస్తారనుకోలేదు. ఆ పార్టీ చూసి నేను చకా అయ్యాను.  ఆ మధుర జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. అది నాకు చాలా ప్రత్యేకమన రోజు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version