సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో “ఎస్ఎస్ఎంబి28” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఓ వీడియో ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ మాది సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Read Also : ఆకు నుంచీ ఆకలి దాకా… ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ మాస్ ధమాకా!
తాజా సమాచారం మేరకు పూజా హెగ్డే “ఎస్ఎస్ఎంబి28” కోసం ఏకంగా 3 కోట్లు పారితోషికంగా అందుకుంటోందట. నిర్మాత ఎస్.రాధాకృష్ణ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందిస్తున్నారు. మరోవైపు పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్” మూవీ విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తుంది. రాధా కృష్ణ కుమార్ ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించారు. అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”లో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.