NTV Telugu Site icon

Pooja Hegde : తమిళ్ లో స్టార్ హీరోలతో జోడీ కడుతోన్న పూజాహెగ్డే

Pooja

Pooja

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ.

Also Read : G.V Prakash : హీరోయిన్ తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

రెట్రోతో పాటు జన నాయగన్ లాంటి బిగ్ హీరో  భారీ ప్రాజెక్ట్ పూజా హెగ్దే ఖాతాలో ఉన్నాయి . ఇళయదళపతి విజయ్ చివరి సినిమాగా వస్తోన్న జననాయగన్ లో మేడమ్ దే మెయిన్ రోల్. అలాగే కాంచన4లో రాఘవ లారెన్స్ తో కలిసి స్టెప్పులేయబోతుంది అమ్మడు. దీనితో పాటు హిందీలో ఓ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇవే కాదు ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో మరో క్రేజీ ఫిల్మ్ పడ్డట్టు టాక్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్- రజనీకాంత్ కాంబోలో వస్తోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీలో కనిపించబోతుంది. హీరోయిన్ గా కాదు ఐటమ్ నంబర్ కోసం దర్శకుడు ఆమెను అప్రోచ్ అయ్యాడట. పూజాతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడించాలని అనుకున్నాడట లోకేశ్. ఇప్పటికే రంగస్థలం, ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ లో మెరిసిన బ్యూటీ  ఒప్పుకుంటే ఇదే తొలి తమిళ్ ఐటమ్ సాంగ్. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగా ఐటమ్ సాంగ్ అంటే ఆలోచించాల్సిన హీరోయిన్లు ఆలోచనలో పడుతుంటారు. కానీ పూజా తీరే వేరుగా కనిపిస్తోంది. తన కెరీర్ బిల్ట్ కావడానికి కారణమైన కోలీవుడ్ లో ఏ ఆఫర్ వచ్చినా చేసేందుకు రెడీ అన్నట్లే కనిపిస్తోంది.