చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య గొడవలు ఉన్నట్లే హీరోయిన్ల మధ్య కూడా ఉంటాయి. అయితే కొన్ని కనిపించవు.. మరికొన్ని బహిరంగంగానే బయటపడతాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, పూజ హెగ్డే ల మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. ఒకానొక సమయంలో పూజా .. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను షేర్ చేస్తూ మే నటనను కించపరుస్తూ మాట్లాడింది. అయితే ఆ తరువాత అది తన తప్పు కాదని, తన ఇన్స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్ చేసి ఈ పని చేసినట్లు పూజ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ పై హీరోయిన్ సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి, సింగర్ చిన్మయి కామెంట్స్ విరుచుకుపడ్డారు. దారుణంగా పూజలను ట్రోల్స్ చేశారు. అప్పటి నుంచి పూజా-సామ్ ల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. వారి మధ్య మాటల్లేవని నెటిజన్లు అభిప్రాయానికి వచ్చేశారు. ఇక తాజాగా సామ్ చేసిన పనితో మరోసారి ఈ ముద్దుగుమ్మల గొడవ బయటికి వచ్చింది. పూజ హెగ్డే, విజయ్ సరసం బీస్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి అరబిక్ కుత్తు సాంగ్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
‘హలమిత్తి హబీబో’ అంటూ ఈ పాటకు పూజా స్టెప్పులేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి బెల్లీ డాన్స్ చేసి వీడియోను పోస్ట్ చేయవలసిందిగా ఛాలెంజ్ విసిరింది. ఇక ఈ ఛాలెంజ్ ని సామ్ స్వీకరించి ఎయిర్ పోర్ట్ లో ‘హలమిత్తి హబీబో’ అంటూ చిందులు వేసి సోమికల్ మీడియా లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా విజయ్, సినిమా బృందంతో పాటు పూజా హెగ్డే ని కూడా ట్యాగ్ చేసింది. ఇంకేముంది అదికాస్తా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై పూజ కూడా స్పందించడంతో ఈ టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సామ్ డ్యాన్స్ వీడియోని పూజా తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ “అద్భుతం” అని కామెంట్ పెట్టింది. దీంతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య వైరం తొలగినట్లే అని, త్వరలోనే వీరిద్దరూ కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి ముందు ముందు ఈ హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారేమో..
