Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Pooja Batra Re Entry With Squad Movie

‘స్క్వాడ్’తో రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా బాత్రా!

Published Date :November 10, 2021 , 5:47 pm
By Manohar
‘స్క్వాడ్’తో రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా బాత్రా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కినేని నాగార్జున ‘సిసింద్రి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా బాత్రా! అందులో స్పెషల్ సాంగ్ లో నర్తించిన పూజా బాత్రా… ఆ తర్వాత దాసరి నారాయణ రావు తన కొడుకు అరుణ్ కుమార్ ను హీరోగా పరిచయం చేసిన ‘గ్రీకువీరుడు’లో హీరోయిన్ గా నటించింది. హిందీ, తెలుగుతో పాటు పలు మలయాళ చిత్రాలలోనూ నటించిన పూజా బాత్రా 2002లో ఎన్.ఆర్.ఐ. డాక్టర్ సోనూ అహ్లూవాలియా ను పెళ్ళాడి అమెరికాకు మకాం మార్చేసింది. అయితే ఎనిమిదేళ్ళ కాపురం తర్వాత 2011లో భర్త నుండి పూజా బాత్రా విడిపోయింది. ఆ పైన ఇద్దరూ విడాకులకు అప్లయ్ చేశారు. డైవర్స్ వచ్చిన తర్వాత నటుడు నవాజ్ షా ను 2019లో పెళ్ళి చేసుకుంది పూజా బాత్రా. అప్పటి నుండి సినిమాల్లో రీ-ఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె కోరిక తీరింది. ఈ నెల 12న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘స్క్వాడ్’ మూవీలో పూజా బాత్రా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటుడు డానీ డి జంగ్పా తనయుడు రిన్ జింగ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా గురించి పూజా బాత్రా మాట్లాడుతూ, ‘దర్శక నిర్మాత నీలేష్ సహాయ్ ఇందులో నందినీ రాజ్ పుత్ అనే పాత్రను నన్ను దృష్టిలో పెట్టుకునే రాశారు. ఈ స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామినయ్యాను” అని తెలిపింది. దేశభక్తిని ప్రేరేపించే సన్నివేశాలతో పాటు ఎమోషనల్ బాండింగ్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయని పూజా బాత్రా చెబుతోంది. విశేషం ఏమంటే… ఆమె ద్వితీయ వివాహం చేసుకున్న నటుడు నవాజ్‌ షా తెలుగులో ఆ మధ్య వచ్చిన బాలకృష్ణ ‘డిక్టెటర్’లో నటించాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • pooja batra
  • pooja batra re entry
  • pooja batra re entry with squad movie
  • squad movie

తాజావార్తలు

  • Vijay TVK: తమిళ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీఏ గూటికి దళపతి విజయ్?

  • Strait of hormuz: “భారత్ మా మిత్రుడు”.. హార్ముజ్‌లో మన నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.!

  • IndiGo: ఇరాన్ వార్ ఎఫెక్ట్.. పెరిగిన ఇండిగో టికెట్ ధరలు..

  • Fake Rank: UPSCలో ర్యాంక్ సాధించానన్నాడు.. ఎమ్మెల్యే, పోలీసులు ఘనంగా సన్మానం.. కట్ చేస్తే అంతా ఫేక్..

  • Oil Crisis: చమురు సెగ.. రోజుకు రూ.2 వేల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions