Mani Ratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ. ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను మణిరత్నం అభిమానులతో పంచుకున్నాడు. సినిమా మొత్తంలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొనే పాత్ర నందిని.. ఐశ్వర్య రాయ్ ఈ పాత్రలో నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. చోళులు మీద పాగా తీర్చుకొనే విలన్ గా ఐష్ ఈ సినిమాలో కనిపించనుంది.
కాగా, మొదట ఐష్ పాత్ర కోసం మరో బాలీవుడ్ బ్యూటీ ని అనుకున్నాడట మణిరత్నం. అయితే అది ఇప్పుడు కాదట.. మణిరత్నం ఈ సినిమాను ఎప్పటినుంచో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కలలు కన్నాడు. విక్రమ్ ప్లేస్ లో రజినీ కాంత్ ను, కార్తీ ప్లేస్ లో కమల్ హాసన్ ను పెట్టి తెరకెక్కించాలనుకున్నాడు. ఆ సమయంలో నందిని పాత్రకు సీనియర్ నటి రేఖను తీసుకోవాలని అనుకున్నారట. అమితాబ్ బచ్చన్ గర్ల్ ఫ్రెండ్ రేఖ అని అందరికి తెల్సిందే. కొన్ని కారణాల వలన ఈ జంట పెళ్లి చేసుకోలేదు.. ఇక ఇప్పటికి రేఖ.. పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తూనే ఉంది. అలా ఆ సమయంలో అమితాబ్ గర్ల్ ఫ్రెండ్ మిస్ అయ్యింది. ఇక ఇప్పుడు అదే ప్లేస్ లో అమితాబ్ కోడలు ఐశ్వర్య రాయ్ తో ఫినిష్ చేశాడు మణిరత్నం.. ఏదిఏమైనా ఇప్పటికైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా కోలీవుడ్ లో మరో బాహుబలి అవుతుందో లేదో చూడాలి.