రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య, ఆమె మాజీ ప్రేమికుడు మస్తాన్ సాయి కేసు నిరంతర ప్రక్రియలాగా సాగుతుంది. మస్తాన్ సాయి పై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మస్తాన్ సాయికి సంబంధించి ఆధారాలు యువతులను వేధించి శారీరకంగా వాడుకుని వాటిని వీడియోయూ తీసి బెదిరించాడని అందుకు సంబంధిచిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. మస్తాన్ సాయి ఇంట్లో అమ్మాయిల తో డ్రగ్ పార్టీలు జరిగాయి. ఈ పార్టీలో పాల్గొన్న సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు పాల్గొన్నారని, డ్రగ్ పార్టీ వీడియో ఫోటోలను పోలీసులకు అందజేసింది లావణ్య. గంజాయి, డ్రగ్స్ వాడినట్లు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీలు చేసుకుంటున్న వీడియోలు పోలీసులకు అందజేసింది లావణ్య.
Also Read : Bollywood : ఖాన్ vs కేసరి.. బరిలో గెలిచేదెవరో..?
ఈ నేపథ్యంలో మస్తాన్ సాయి కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. మస్తాన్ సాయిని కస్టడీ కోరారు నార్సింగి పోలీసులు. వారం రోజులపాటు మస్తాన్ సాయిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటీషన్ లో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు డ్రగ్స్ టెస్ట్ లో మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో పోలీసులు ఈ కేసును లోతుగా విచారించనున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయి మొబైల్ సీజ్ చేసారు పోలీసులు. మస్తాన్ సాయి మొబైల్ లో వేలాదిమంది అమ్మాయిల కాంటాక్ట్ లిస్ట్ ను కనుగొన్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విచ్చలవిడిగా డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం పై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. రానున్న రోజుల్లో డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.