Prabhas: యంగ్ రెబల్ స్టార్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. నడిరోడ్డుపై కారు ఆపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదేరాబద్ ట్రాఫిక్ పోలీసులు నిభందనలు ఉల్లంఘించినవారిపై కొరడా జుళిపిస్తున్నారు.సామాన్యులు, సెలబ్రిటీలు అనే బేధం చూపించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రీటీలు ప్రైవసీ కోసం బ్లాక్ ఫిల్మ్‌లు వాడుతుంటారని అందరికి తెలిసిందే. ఇటీవల వారిని కూడా పోలీసులు వదలడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్, మంచు మనోజ్, నాగ చైతన్య కార్లను అడ్డుకున్న పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి జరిమానా విధించారు. ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ప్రభాస్ కారును ఆపిన పోలీసులు కారుకు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండడం, కారుకు ఎంపీ స్టిక్కర్ అతికించి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే బ్లాక్ ఫిల్మ్ ను, ఎంపీ స్టిక్కర్ తొలగించి రూ.1,450 జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో కారులో ప్రభాస్ లేరని, డ్రైవర్ చేత జరిమానా కట్టించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!