పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. నాలుగు సినిమాలని లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ కూడా చేస్తున్నాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే కంప్లీట్ చేసేశారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సముద్రఖని. జూలై 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో.. పవన్ దేవుడిగా కనిపించబోతున్నాడు. గోపాల గోపాల తర్వాత పవన్ చేస్తున్న గాడ్ రోల్ ఇదే. ఈ క్రమంలో దేవుడు కలిసొచ్చేలా ఓ టైటిల్‌ను అనుకుంటున్నారట. మేకర్స్ ఇంకా ఎలాంటి టైటిల్ ఫిక్స్ చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా రోజులుగా ఏవేవో టైటిల్స్ వినిపిస్తునే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకి ఒక టైటిల్ ఫిక్స్ అయిందనే టాక్ ఇండస్ట్రీలో బయటకి వచ్చింది.
‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కథ ప్రకారం ‘దేవుడే దిగి వచ్చిన’ టైటిల్ పర్ఫెక్ట్ సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే.. దేవుడే దిగి వచ్చిన.. స్వర్గమే నాకిచ్చినా.. అంటూ, నాగర్జున సంతోషం మూవీలో ఓ పాట ఉంది. ఇప్పుడు నాగ్ సాంగ్ నుంచే పవన్ సినిమాకు టైటిల్‌గా పెట్టడం విశేషంగా మారింది. అయితే అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ ఇందులో నిజముందని చెప్పలేం. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. మరి మెగా మేనల్లుడితో కలిసి పవర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.