Site icon NTV Telugu

People Media Factory: ఒకే నెలలో రెండు సినిమాలు!

People

People

Takkar: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వేగం పెంచింది. డైరెక్ట్ గా సినిమాలను నిర్మించడమే కాకుండా అదర్ లాంగ్వేజ్ మూవీస్ ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం ‘టక్కర్’ను తెలుగులో అభిషేక్ అగర్వాల్ తో కలిసి విడుదల చేయబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి. జి. విశ్వప్రసాద్ నిర్మించిన ‘రామబాణం’ మే 5న వస్తుంటే, డబ్బింగ్ మూవీ ‘టక్కర్’ మే 26న రిలీజ్ కాబోతోంది. అంటే ఈ సంస్థ నుండి రెండు సినిమాలు ఒకే నెలలో వస్తున్నట్టు. నిజానికి ఇలాంటి రేర్ ఫీట్ ఈ యేడాది ప్రారంభంలో మైత్రీ మూవీ మేకర్స్ చేసింది. ఆ సంస్థ నిర్మించిన ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఒక్క రోజు తేడాతో జనం ముందుకు వచ్చాయి. అలానే గత యేడాది సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నుండి కూడా రెండు సినిమాలు వారం గ్యాప్ తో విడుదల అయ్యాయి.

ఇక ‘టక్కర్’ విషయానికే వస్తే… ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఈ తమిళ సినిమా మూడేళ్ళ క్రితం నాటిది. షూటింగ్ పూర్తయినా, కరోనా దెబ్బకు అది జనం ముందుకు రాలేదు. ‘మజిలీ’ మూవీ తర్వాత దివ్యాంశ కౌశిక్ తమిళంలో మొదట సైన్ చేసింది ఈ సినిమాకే. బట్ … దీని విడుదలలో జాప్యం జరగడంతో ఆమె సెకండ్ తమిళ మూవీ ‘మైఖేల్’ ముందుగా జనం ముందుకు వచ్చింది. అయితే…. ఆమె నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘మైఖేల్’ చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో దివ్యాంశ ఆశలన్నీ ఇప్పుడు ‘టక్కర్’ మీదనే పెట్టుకుంది. అలానే సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ‘మహా సముద్రం’లో నటించాడు. భారీ అంచనాలతో 2021లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. ఇక ‘టక్కర్’ దర్శకుడు కార్తీక్ జి. క్రిష్‌ గతంలో ఎ. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ తో ‘కప్పల్’ మూవీ తీశాడు. అది తెలుగులో ‘పాండవుల్లో ఒకడు’ పేరుతో డబ్ అయ్యింది కానీ జనాలను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత సిద్ధార్థ్‌ తో ‘సైతాన్ కా బచ్చా’ అనే సినిమా మొదలెట్టాడు. అది ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. ఆ రకంగా ఇటు హీరో సిద్ధార్థ్ కు, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కు, డైరెక్టర్ కార్తీక్ జి క్రిష్ కు ‘టక్కర్’ అనేది ఓ లిట్మస్ టెస్ట్ లాంటిది. మరి తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్స్ దీనిని రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

Exit mobile version