Site icon NTV Telugu

Peddi : పెద్ది రిలీజ్ ఆ రోజే.. నో డౌట్స్?

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రన్‌టైమ్ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పీఆర్ టీం తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. నెట్టింట ప్రచారమవుతున్న రన్‌టైమ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటలకు పైగా ఉంటుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరింది. సినిమా మొదటి భాగం ఎడిటింగ్ పూర్తయి ఇప్పటికే లాక్ చేయబడింది, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఫస్టాఫ్‌కు సంబంధించి రీ-రికార్డింగ్ (RR) పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. రెండో భాగం ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది, సమాంతరంగానే ఎడిటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

Also Read : Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’లో యంగ్ హీరో సర్ప్రైజ్ ఎంట్రీ

షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్నాయని, ఎక్కడా జాప్యం లేదని టీమ్ స్పష్టం చేసింది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ‘చికరి చికరి’ మరియు ‘రై రై రా రా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ‘రై రై రా రా’ పాటలో చరణ్ వేసిన మాస్ స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమనిపిస్తోంది. వృద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Exit mobile version