తెలుగులో తమిళ హీరోల మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ టాప్ లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో రజనీకాంత్ సినిమా ఎప్పుడు విడుదలైనా తమిళంలోలాగే పండుగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా రజనీకాంత్ నటించిన “అన్నాత్తే” చిత్రం విడుదలైంది. శివ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం “పెద్దన్న” అనే ఈ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు, తమిళ హక్కులను పొందింది. నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ఉంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రాఫర్, రూబెన్ ఎడిటర్.
Read Also : ఒకే రోజు మహేశ్ బాబు రెండు సినిమాల ప్రకటనలు!
నిన్న అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్లు ప్రదర్శితం కాగా, సినిమాను చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ రివ్యూ ప్రకారం “పెద్దన్న” సినిమాను మిక్స్డ్ టాక్ నడుస్తోంది. రజినీకాంత్ అభిమానులు ఇంటర్వెల్ సీన్, రజినీకాంత్, ఫస్ట్ హాఫ్ కమర్షియల్ గా ఉందని, సెకండ్ హాఫ్ లో ఇమ్మాన్ సంగీతమే హీరో అని అంటున్నారు. మరోవైపు సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమాలో కొత్తదనం ఆశించవద్దు. చాలా సన్నివేశాలు శివ గత చిత్రాల నుండి తీసినట్లుగా ఉన్నాయని అంటున్నారు. మరి సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.