రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రోహత్గీ మరోసారి చిక్కుల్లో పడింది. ఆమెపై పూణెలో ఓ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తాజాగా పాయల్ రోహత్గీ మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో గాంధీల గురించి ఆమె అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిందంటూ ఆరోపణలు వచ్చాయి. పూణె జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంగీత తివారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివాజీ నగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 153 (ఎ), 500, 505 (2), 34 సెక్షన్ల ప్రకారం ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేశారు.
Read Also: రోడ్డు దారుణం.. కాస్త చూడండి కేటీఆర్ గారూ
గత యేడాది సైతం పాయల్ రోహత్గీ ఇలానే అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పట్లో సోషల్ మీడియాలో భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూను విమర్శిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దాంతో రాజస్థాన్ లోని యూత్ కాంగ్రెస్ లీడర్ చర్మేశ్ శర్మ ఆమెపై ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 66, 67పై కేసు పెట్టాడు. ఆ తర్వాత ఆమె ఆ కేసులో బెయిల్ పొందింది. మరి పూణెలో నమోదైన కేసు నుండి పాయల్ రోహత్గీ ఎలా బయటపడుతుందో చూడాలి.