రోడ్డు దారుణం.. కాస్త చూడండి కేటీఆర్ గారూ

రాష్ట్ర రాజధాని ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి విషయాలను నేరుగా పొలిటికల్ లీడర్స్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం లభించింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అంశాలను సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకుల దృష్టిని తీసుకెళ్తూ పలువురు సెలెబ్రిటీలు తమవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా 600 కుటుంబాలు నివసించే ఓ ప్రాంతంలో రోడ్డు ఏమాత్రం బాగాలేదని, అక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్లు నిర్మించడానికి చొరవ తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ను కోరారు.

Read Also : “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్

ఈ మేరకు ఆయన “రాఘవేంద్ర సమాజం, కైతాలాపూర్, కూకట్‌పల్లి… కేటీఆర్ గారు ఇది అనాథాశ్రమం (చీర్స్ ఫౌండేషన్). ఈ కాలనీలో నివసిస్తున్న 600 కుటుంబాలకు దారి తీసే రహదారి ఇది. మీరు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నాను. గ్రేటర్ తెలంగాణ దిశగా మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు” అంటూ ఆ రోడ్డు పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

Related Articles

Latest Articles

-Advertisement-