Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతోను, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ నట వారసుడు అకీరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడో అని పవన్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ, అకీరా తల్లి రేణు దేశాయ్ మాత్రం అకీరా ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అకీరా తన ఇంట్రెస్ట్ ను బట్టి తన కెరీర్ ను సెట్ చేసుకుంటాడు అని చెప్పి మాట దాటేసింది. కనీసం అకీరా చెల్లి ఆద్య అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కానీ అకీరా మాత్రం అస్సలు సోషల్ మీడియాలో కనిపించని కనిపించడు. ఇక రేణు అప్పుడప్పుడు పిల్లల ఫోటోలు పోస్ట్ చేసినా అందులో కూడా అకీరా ఫేస్ సరిగ్గా చూపించడు. అప్పుడెప్పుడో పండుగ వేళ అకీరా ఫేస్ ను చూపించింది రేణు. ఇక తాజాగా చెల్లి ఆద్యతో అకీరా ఆడుకుంటున్న ఒక వీడియోను పోస్ట్ చేసింది రేణు.
ఇక అందులో అకీరా లుక్ చాలా కొత్తగా కనిపిస్తోంది. నూనూగు మీసాలతో మాస్ హీరోల కనిపిస్తున్నాడు. హుడితో ముఖాన్ని కప్పుకున్నా ఆ గడ్డం లుక్ పవన్ నే తలపిస్తోంది. సడెన్ గా చూసి అకీరా అప్పుడే ఇంట పెద్దవాడు అయిపోయాడా..? అని కొందరు అంటుండగా పవన్ నట వారసుడు యుద్దానికి సిద్ధం అవుతున్నాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీలో వరుణ్ తర్వాత ఆ హైట్ ను మెయింటైన్ చేస్తున్నాడు అకీరా. హైట్ తగ్గ వెయిట్ తో హీరో మెటీరియల్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాడు అకీరా. ఈ సమయంలో కానీ అకీరా టాలీవుడ్ ఎంట్రీ కనుక పడితే మాస్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. మరి పవన్ నటవారసుడు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.