OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ సంచలనాన్నే సృష్టిస్తోంది. ‘ఓజీ 2’ మేకర్స్ విడుదల చేసిన ఒకే ఒక్క ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఇంత రిలాక్స్డ్గా, స్టైలిష్‌గా చూసిన అభిమానులు ఈ లుక్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. వైరల్ ఫోటోలో పవన్ కళ్యాణ్ నల్లటి హూడీ ధరించి, గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా, కూల్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో స్క్రీన్ ప్రెజెన్స్‌ను గుర్తు చేసే ఇంటెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికల్లో ఈ ఫోటో వేగంగా వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్‌కు వచ్చిన అత్యంత స్టైలిష్ లుక్‌లలో ఇదొకటిగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఈ ఫోటోకి ఎడిట్లు, అభినందన పోస్టులతో అన్ని ప్లాట్‌ఫామ్‌లను ముంచెత్తారు.
సినిమా ప్రపంచంలో స్టార్ హీరోల లుక్స్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి భారీ అభిమాన వర్గం ఉన్న హీరో విషయంలో చిన్న అప్డేట్ కూడా పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పుడు విడుదలైన ఈ ఫోటో కూడా అదే పరిస్థితిని తీసుకొచ్చింది. సినిమా నుంచి ఎలాంటి టీజర్, ట్రైలర్ విడుదల కాకముందే ఒక స్టిల్‌తోనే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ లుక్‌లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్‌ను చూసి ‘ఓజీ 2’లో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే చర్చ కూడా మొదలైంది.
Also Read
ఇదిలా ఉండగా ‘ఓజీ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌ను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంగీత దర్శకుడు తమన్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ‘ఓజీ 2’ గురించి అప్ డేట్స్ పరిమితంగానే ఉన్నప్పటికీ, ఒక్క ఫోటోతోనే సినిమా చుట్టూ భారీ హైప్ మొదలవడం పవన్ కళ్యాణ్ స్టార్డమ్కు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు. విడుదలైన ప్రతి చిన్న అప్డేట్ను పండుగలా జరుపుకునే అభిమానుల ఉత్సాహం చూస్తే, ‘ఓజీ 2’ విడుదల సమయానికి ఈ అంచనాలు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి చిత్రబృందం విడుదల చేయబోయే తదుపరి అప్డేట్పైనే నిలిచింది.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?