టాలీవుడ్లో భారీ అంచనాలు సృష్టిస్తున్న చిత్రాల్లో పవన్ కల్యాణ్ నటిస్తున్న “ఓజి” ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి అప్డేట్తో అభిమానుల్లో హైప్ పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏంటంటే..
Also Read : BIGG BOSS 19 : సల్మాన్ ఖాన్ ఫీ తగ్గింపు.. బిగ్ బాస్ 19లో కొత్త ట్విస్ట్ ఇదేనా?
ఇటీవల విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్‌లో కొన్ని విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి. ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడా? అనే ఊహాగానాలు మొదలుపెట్టారు. అదీ కాక, సినిమాలో ఓ ప్రత్యేక క్యామియో ఉందని టాక్, అది అకీరానే అన్న వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. మరి కొంతమంది, సినిమాలో పవన్ కల్యాణ్ మూడు వేర్వేరు దశల్లో కనిపించనున్నారు. అందులో యంగ్ ఏజ్ లుక్ కూడా ఒకటి. ఈ లుక్ కోసం అకీరా సెట్ చేస్తే, అది నిజంగా థియేటర్స్‌లో బ్లాస్ట్ అవుతుందని అంటున్నారు. అయితే, ఈ వార్త పై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు కానీ. కొందరు ఇది కేవలం రూమర్స్ అని.. మరికొందరు మాత్రం ఇందులో నిజం ఉందని నమ్ముతున్నారు. ఏదేమైనా, అకీరా నందన్ “ఓజి”లో కనిపిస్తే, అది అతనికి గ్రాండ్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.