Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే అమెరికా ప్రయాణం ముగించుకొని వచ్చిన ఆయన వెంటనే హరిహర వీరమల్లు సినిమా వర్క్ షాప్ లో ప్రత్యేక్షమయ్యారు. ఇక రాజీకాయల్లోకి వచ్చిన దగ్గరనుంచి పవన్ అత్యధికంగా నేత దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. తెల్ల కుర్తి, తెల్ల పంచెలోనే జనసేనాని ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక అప్పుడప్పుడు బయట కనిపించిన కుర్తి వదిలింది లేదు. ఎప్పుడో ఒకసారి అలా ఫార్మల్ డ్రెస్సులో కనిపించి కనువిందు చేసినా జీన్స్, టీ షర్ట్ లో పవన్ ఈ మధ్యకాలంలో మెరిసింది లేదు. ఇక దీంతో పవన్ వింటేజ్ లుక్ ను, వెంటేజ్ స్టైల్ ను మిస్ అయ్యినట్లు పవన్ ఫ్యాన్స్ చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా వారందరు పండగ చేసుకొనే ఫోటోను సంగీత దర్శకుడు కీరవాణి షేర్ చేశారు.
హరిహర వీరమల్లు సినిమా వర్క్ షాప్ లో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. రెడ్ టీ షర్ట్, బ్లూ జీన్స్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అని కీరవాణి క్యాప్షన్ పెట్టుకురాగా.. ఈ ఫోటో షేర్ చేసి మీరు మాలో నవ ఉత్తేజం నింపారని పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ను ఈ లుక్ లో చూసి ఎన్ని రోజులయ్యిందో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక హరిహర వీరమల్లు విషయానికొస్తే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా.. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ ను ఈ సినిమా పూర్తి చేసుకుందని టాక్.. త్వరలోనే సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.