Pawan Kalyan : పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు తెలిపారు. ఆయన నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేస్తారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు యాక్టింగ్ అనేది కురదు. కానీ ప్రొడక్షన్ మాత్రం కచ్చితంగా చేస్తాను. ఎందుకంటే సినిమాల్లో నటించాలంటే ఏడాది, రెండేళ్లు కేటాయించాలి.
Read Also : Kingdom : కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?
అన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండటం కుదరదు. కానీ నాకు సినిమానే ఇంధనం లాంటిది. నాకు వేరే బిజినెస్ లు లేవు. వేరే పనులు రావు. అందుకే సినిమాలను వదలను. యాక్టింగ్ మానేసినా ప్రొడక్షన్ చేస్తా అంటూ స్పష్టం చేశాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను త్వరలోనే కంప్లీట్ చేస్తానన్నారు. వీరమల్లు సినిమా మొత్తం ఔరంగజేబు అప్పట్లో హిందువులపై సాగించిన హింసా కాండ చుట్టూ తిరుగుతుందని.. కోహినూర్ వజ్రాన్ని సాధించే పోరాట యోధుడికథతో సాగుతుందన్నారు. అయితే పవన్ హీరోగా సినిమాలు చేయకపోవచ్చని ప్రకటించడంతో ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి నిర్మాతగా ఎప్పుడు మారుతాడు.. ఎవరితో మొదటి సినిమా చేస్తాడనేది మాత్రం త్వరలోనే తెలిసే ఛాన్స్ ఉంది.
