నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మలయాళం స్టార్ హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సోదరులందరికి, ఇక్కడకు వచ్చిన పెద్దలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెలకు ముందుగా నా నమస్కారం.. అభిమానులుగా మీ ఉరకలెత్తే ఉత్సాహం లేకపోతే ఈ ఈవెంట్స్ కు అందం ఉండదు.. ఈ సభలకు విశిష్ట అతిధులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అంటే సుందరానికీ సినిమా ఈవెంట్ కు నన్ను ఆహ్వానించినందుకు నిర్మాతలకు నా ధన్యవాదాలు. హీరో నాని నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.. బలంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. ఇక హీరోయిన్ గా నటించిన నజ్రియా గారికి తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సినిమాలో మీరు బాగా చేసారని అందరు చెప్తుంటే నేను కూడా మీ నటనను చూడాలనుకుంటున్నాను. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
ఒక సినిమా అద్భుతంగా మనల్ని అలరించాలి, బావుండాలి అంటే వెన్నుముక దర్శకుడు, రచయిత .. ఆ రెండింటిని ఒకటే రూపంలో వచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు.. చాలా అద్భుతంగా చేసి ఉండాలి.. తెలుగు చిత్ర పరిశ్రమ ఇది ఒకరి సొత్తు కాదు .. అందరి సొత్తు.. మీ అందరి అభిమానం.. ప్రజల కోసం పనిచేయగలిగే, నిలబడగలిగే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె దైర్యం మీరు ఇచ్చారు. మీ అభిమానం ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది. మా అన్నయ కావొచ్చు, నా సోదరుడు నాగబాబు కావచ్చు.. మా కుటుంబం నుంచి వచ్చిన నటీనటులది కావొచ్చు.. తెలుగు చిత్రపరిశ్రమ మన అందరిది. ముఖ్యంగా ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రతి హీరో, దర్శకుడు, నిర్మాత మా సినిమా బావుండాలని కోరుకుంటాం.. అంతేకాని ఎదుటివారి సినిమా పోవాలని కోరుకోము .. కాకపోతే మా సినిమా ఇంకా ఎక్కువ బావుండాలని కోరుకుంటాం అది సహజం .. అంతే తప్ప.. తెలుగు చిత్ర పరిశ్రమ.. రాజకీయపరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. నరేష్ గారికి విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. నాకు విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు.. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు.. ఆ స్పష్టత నాకు ఉంది. ఎందుకంటే ఇది 24 క్రాఫ్టులు కలిపితే వచ్చే సినిమా.. చాలామంది కళాకారులు కలిస్తే వచ్చే సినిమా.. ఈ కళకు కులం, మతం, ప్రాంతం ఉండదు.. ఒక్క సినిమా కోసం విభిన్నమైన వ్యక్తులను, భాష, ప్రాంతం అన్ని వేరు అయినా అందరు కలిసి అంటే సుందరానికీ సినిమా తీశారు. గొప్పదనం ఏంటి అంటే ఇంతమందిమి కలిస్తే తప్ప ఇంతమందిని ఆదరించలేం. అందుకే నాకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే అపారమైన గౌరవం.. ఆరాధన..ఈ సినిమా ఘన విజయం సాధించాలని కొరుకుతూ .. నానిగారికి మంచి విజ్జయం సాధించాలని కోరుకుంటున్నాను. నాని గారికి మా ఇంట్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఏడాది క్రితం అనుకుంటా మా చెల్లి హడావిడిగా బయల్దేరి వెళ్తుంది.. ఎక్కడికి అంటే నాని సినిమాకు అని చెప్పింది.. ఆయన ఒక విలక్షణ నటుడు.. ఆయనకు ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక ఈ ఈవెంట్ లో నా ఏవీ వేయొద్దని నిర్మాతలకు, హరిశ శంకర్ కు తెలియజేశాను. ఇది నాని గారి సినిమా.. వారి సినిమా ఏది నా ఏవీ వద్దు.. ఎందుకంటే ఈ సినిమా హీరో నాని గారు.. ఏ సినిమాకైనా హీరోనే ముందు ఉండాలి.. అందుకే నాని గారే ముందుండాలి తప్ప నేను వెనుక ఉండాలని చెప్పినా కూడా నిర్మాతలకు చెప్పినా కూడా వారు నా మాట వినకుండా నా ఏవీ వేసినందుకు నిజంగా వారిపై కోపం గా ఉంది. వెయ్యకపోతే మీరు కోపడతారని వేసి ఉంటారు. నాకు నా ఏవీ చూస్తుంటే భయమేసింది. చెమట పట్టేసింది.. నన్ను నేను చూసుకోలేకపోయాను.. రాజకీయాల్లో గొడవ పెట్టుకోవాలి అంటే తేలికగా ఉంది కానీ సినిమా చూడాలంటే భయమేస్తుంది. నా డాన్స్ వీడియోలను చూసాకా నేను ఇంత డాన్స్ చేయగలనా అని నాకే అనిపించింది. అది నాకు ఏమాత్రం ఇష్టంతో కాదు మీరంటే భయంతో డాన్స్ చేసినవి అవన్నీ.. ఏ మాత్రం కాలు కదపకపోతే మీరు అందరిని ఏడిపిస్తారు కదా.. మీకు భయపడి, మీ అల్లరి తట్టుకోలేక.. ఆల్ మోస్ట్ గన్ పాయింట్ లో పెట్టి దర్శక నిర్మాతలు చేయిస్తుంటారు డాన్స్.. దాని నుంచి వచ్చిన డాన్స్ అది.. నాకు వెనుకనుంచి మ్యూజిక్ వస్తుంటే నడవడం చాలా ఇష్టం.. దయచేసి నాకు నడిచే అవకాశం ఇవ్వండి.. డాన్స్ చేసే అవకాశం వద్దు.. చేయలేను ఇప్పుడు క్షమించమని కోరుకుంటూ మీ అందరు ఆయురారారోగ్యాలతో ఉండాలని, మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యంతో ఉండాలి.. క్షేమంగా ఇంటికి వెళ్ళండి.. మీరందరరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ జైహింద్..