Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపుతోంది. చాలా సినిమాల్లో గ్లామర్ డ్యాన్స్ తో హోరెత్తిస్తోంది. ఈ సాంగ్స్ కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని సమాచారం. రీసెంట్ గానే స్త్రీ2 సినిమాలో మెరిసింది.
Read Also : OG : పవన్ కల్యాణ్ వద్దన్నా ఆగని హైప్.. ఇదేం క్రేజ్..
ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసేందుకు రూ.5 కోట్ల దాకా తీసుకుంటోంది. అదే టైమ్ లో ఒక్క సాంగ్ చేసేందుకు ఎంత లేదన్నా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల దాకా తీసుకుంటోంది. తమన్నాకు ఉన్న మాస్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా అంత ఇచ్చేందుకు ఓకే అంటున్నారు. అదే తమన్నాకు ప్లస్ అవుతుంది. సినిమా అయితే నెలల తరబడి డేట్లు ఇవ్వాలి. అదే సాంగ్ అయితే మహా అయితే వారం రోజుల కంటే ఎక్కువ పట్టదు. అందుకే సాంగ్స్ చేస్తూ మిగతా స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తోంది ఈ బ్యూటీ.
Read Also : Kalyani Priyadarshan : అనాథఆశ్రమంలో పెరిగా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్