OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వర్షం పడుతున్నా సరే ఈవెంట్ మాత్రం ఆపలేదు. ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ జోష్ తో మాట్లాడారు. నేను ఈ కాస్ట్యూమ్ లో రావడానికి కారణం సుజీత్. అతను నా ఫ్యాన్. అతనితో సినిమా చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఒక అభిమాని వచ్చి నాతో ఇలా సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు. అతను నాకు ఎంత పెద్ద అభిమాని అంటే నేను జానీ సినిమా తీసినప్పుడు అతను చిన్న పిల్లాడు.
Read Also : Idiot : ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్.. అది చేసుంటే వేరే లెవల్..
ఆ సినిమా చూసి హెడ్ కి బ్యాండ్ పెట్టుకుని నెల రోజులు అలాగే ఉన్నాడు. అది చూసిన వాళ్ల అమ్మ గారు చూసి చాలా తిట్టి దాన్ని దాచేశారు. అప్పటి నుంచి అతనికి సినిమాల పిచ్చి పట్టుకుంది. ఎలాగైనా సినిమా తీయాలని ఇండస్ట్రీలోకి వచ్చాడు. అతను అనుకున్నట్టుగానే ఓజీ సినిమాతో నన్ను డైరెక్ట్ చేశాడు. సుజీత్ ఎక్స్ ప్లేన్ చేసేది చాలా తక్కువ. కానీ అతను చూపించేది వేరే లెవల్ లో ఉంటుంది. అందుకే సుజీత్ డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. మనం అతని మోడ్ లో పడిపోతాం అంటూ హుషారెత్తించాడు పవన్ కల్యాణ్.
Read Also : OG : పవన్ కల్యాణ్ వద్దన్నా ఆగని హైప్.. ఇదేం క్రేజ్..