Pawan Kalyan Rejected Docterate from Vels University: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ గా అభిమానులు అందరూ ఎంతో అభిమానంగా చూసుకునే పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన పార్టీతో రాజకీయాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ తన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ రాజకీయాలు మాత్రమే చేయకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసే సహాయాలు చాలావరకు గుప్తంగానే జరిగిపోతూ ఉంటాయి. దీంతో ఆయనను సినిమాలు, రాజకీయం కూడా చూడకుండా చాలా మంది ఇతర హీరోల అభిమానులు, ఇతర పార్టీల కార్యకర్తలు సైతం అభిమానిస్తూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కి ఒక ఉన్నత గౌరవం దక్కింది. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ జనసేనానికి డాక్టరేట్ ప్రధానం చేసేందుకు సెలక్ట్ చేసి ఈ నెలలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్‌కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
అయితే పవన్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారని తనకు కాకుండా వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ డాక్టరేట్ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు తనకు ఇస్తున్న డాక్టరేట్‌ని తిరస్కరిస్తూ వేల్స్ యూనివర్సిటీకి పవన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌కి సెలక్ట్ చేయడం సంతోషంగా, గౌరవంగా ఉంది కానీ తనకంటే చాలా మంది గొప్ప వారు ఉన్నారని.. వారిలో సరైన వారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా పవన్ కోరడం చర్చనీయాంశం అయింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావుడి కారణంగా యూనివర్సిటీ 14వ కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.