తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహినూర్ గురించి ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే క్రిష్ చెప్పిన వెంటనే సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో చాలా నలిగిపోయాం. ఇంత నలిగిన తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులు చేస్తుందంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తుందన్నా నేను చెప్పలేను. నేను ఈ రోజుకి చెబుతున్నాను, సినిమా కోసం మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాం. మీరు అంటారు కదా, డాన్సులు చేయరని, అందుకే మీ కోసం కాలు కదిలించి డాన్సులు కూడా చేశాను.
Also Read : HHVM : ప్లాపుల్లో నా కోసం నిలబడింది త్రివిక్రమ్ మాత్రమే : పవన్
ఫైట్ చేసి చాలా కాలం అయింది కానీ ఫైట్స్ కూడా కష్టపడి చేశాను. ఈ 18 నిమిషాల క్లైమాక్స్ పార్ట్ నేనే కొరియోగ్రఫీ చేశాను. ఎందుకంటే మీ ధర్మానికి నీవు టాక్స్ కట్టాలంటే ఎదురు తిరిగే పరిస్థితి, అదే క్లైమాక్స్. ఇదేంటంటే, ఆ టైంలో సగటు భారతీయుడు నలిగిన దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇందులో దాయాల్సిందేమీ లేదు, సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అభిమానులారా, మీరే నా బలం. నేను కష్టాల్లో ఉన్నా, ఓటమిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అన్నా, మేము మీకు ఉన్నామని చెప్పిన వాళ్లు మీరు. మనల్ని ఎవడ్రా ఆపేది అని నేనంటే, మనల్ని ఎవడన్నా ఆపేదని ముందుకు వచ్చారు. మీకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా, ఈ గుండె ఎవరి కోసం కొట్టుకోదు, మీ కోసమే కొట్టుకుంటుంది, మీ కష్టాల కోసం కొట్టుకుంటుంది. మళ్లీ విశాఖపట్నంలో కలుసుకుందాం అంటూ ఆయన కామెంట్ చేశారు.