OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా రిలీజ్ డేట్ మీద చాలా రకాల రూమర్లు ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది అంటూ నానా ప్రచారం జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న యాక్షన్ డ్రామా ఇది. ఇప్పటికే వచ్చిన పాట ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్ పాత్ర గురించే పెద్ద చర్చ జరుగుతోంది. కాగా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఒకటే హంగామా చేస్తున్నారు. ఇప్పుడు, అప్పుడు అంటూ మూవీ టీమ్ నానుస్తోంది. అయితే తాజాగా మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రీసెంట్ గానే పవన్ కల్యాణ్ డైరెక్టర్, నిర్మాతకు సూచించారంట.
Read Also: Pahalgam Terror Attack : మా హృదయాలను పిండేస్తోంది.. పహల్గాం దాడిపై సెలబ్రిటీలు
పెండింగ్ పనులు క్లియర్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న మూవీని రిలీజ్ చేయాలని చెప్పారంట. దీంతో డైరెక్టర్ మూవీ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మే నుంచి వరుసగా అప్డేట్లు కూడా ఇస్తారంట. మే నెలలో హరిహర వీరమ్లలు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత నుంచే ఓజీ మీద అప్డేట్లు ఇస్తారు.. రిలీజ్ డేట్ వచ్చే సరికి మూవీ మీద హైప్ పెంచబోతున్నారు. పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది కూడా ఉంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఓజీ మీద కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా పదే పదే ఓజీ గురించి ప్రస్తావిస్తున్నారు.