బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని నేడు పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్.. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇక రేపు జరగబోయే షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి చేరుకున్న అమితాబ్ ని అదే లొకేషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ రామోజీ ఫిల్మ్ సిటీ లోనే షూటింగ్ జరుపుకుంటుండగా అమితాబ్ వచ్చారని తెలుసుకొని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి అమితాబ్ ని కలిసినట్లు తెలుస్తోంది. రాజకీయాల గురించి కాకుండా కేవలం చిత్రాల గురించే అమితాబ్ తో పవన్ మాట్లాడారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక గతంలో సైరా సమయంలో పవన్ , అమితాబ్ ని కలిశారు. పవన్ తో మాట్లాడితే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని అమితాబ్ అప్పట్లో కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan: అమితాబ్ తో పవర్ స్టార్ భేటీ..

pawan kalyan