పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో పూర్తిస్థాయి జనసేనాని పవన్ కళ్యాణ్ గా మారబోతున్నాడు. 2024 ఎన్నికలకి సిద్ధమవుతున్న పవన్, పొలిటికల్ హీట్ స్టార్ట్ అయ్యే లోపు తను ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసేయ్యాలనే అనే డెడ్ లైన్ ని ఫిక్స్ చేసుకున్నారట. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్, ఒకేసారి నాలుగు సినిమాలకి డెడ్ లైన్ పెట్టుకోని మరీ వర్క్ చేస్తున్నాడట. వినోదయ సీతమ్ రిమీక్ కి సంబంధించి ఇప్పటికే తన పార్ట్ కంప్లీట్ చేసిన పవన్… ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా పరుగులు పెట్టించే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలని బ్యాలెన్స్ చేస్తూ… వారానికి ఒక మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి ముంబై షెడ్యూల్ లో ఒక ఫైట్ తో పాటు ఒక సాంగ్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది.
ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 17 నుంచే స్టార్ట్ కానుంది. దీని తర్వాత వెంటనే చాలా రోజులుగా ఆగిపోయిన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ మళ్లీ స్టార్ట్ చెయ్యబోతున్నాడు పవన్. ఈ ఎపిక్ పీరియాడిక్ డ్రామాలో ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఓ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారట దర్శకుడు క్రిష్. ఈ మంత్ ఎండింగ్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారట. ఈ సాంగ్ షూటింగ్ అయిపోగానే హరిహర వీరమల్లుకి బ్రేక్ ఇచ్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టార్ట్ చెయ్యనున్నారట. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌ని ఏపిలో ప్లాన్ చేస్తున్నారు. జూన్ సెకండ్ వీక్‌లో ఈ షెడ్యూల్ ఉండొచ్చునని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో సెట్స్ పై ఉన్న సినిమాలన్నింటినీ వచ్చే ఆరు నెలల్లో కంప్లీట్ చెయ్యాలనేది పవన్ ప్లాన్. ఈ మేరకు ఆయా సినిమా దర్శక, నిర్మాతలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్పోలియాయట.