Site icon NTV Telugu

Bro Theme: పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ సాంగ్…. ఏం తాగి కొట్టావ్ థమన్?

Bro

Bro

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మెగా ఫాన్స్ అంతా బ్రో సినిమా సాలిడ్ హిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బ్రో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జులై 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత బ్రో సినిమాపై ఎక్స్పెటెషన్స్ ని పెంచుతుందని అంతా అనుకున్నారు కానీ అంతకన్నా ముందే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డ్యూటీ ఎక్కాడు. సినిమా కన్నా ముందు ఈ సాంగ్ విని హైప్ పెంచుకోండి అంటూ ‘బ్రో థీమ్ సాంగ్’ని బయటకి వదిలాడు. కాలం గురించి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్తూ బయటకి వచ్చిన ఈ థీమ్ సాంగ్ సూపర్బ్ ఉంది. పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన ఈ సాంగ్ కి కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయి. ఈ థీమ్ సాంగ్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉంది.  ప్రీరిలీజ్ ఈవెంట్ కన్నా ముందే హైప్ పెంచుతూ బయటకు వచ్చిన ఈ సాంగ్ బ్రో సినిమాపై ఫాన్స్ కి మరింత ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ముఖ్యంగా సాంగ్ ఎండ్ ఎండింగ్ లో వచ్చిన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ.

Read Also: Kavya Thapar : హాట్ థైస్ తో రెచ్చగొడుతున్న కావ్య థాపర్

Exit mobile version