Site icon NTV Telugu

Pawan Kalyan: ‘బ్రో’ టార్గెట్ 100 కోట్లు?

Sai Dharam Tej Bro Movie Shoot Experience

Sai Dharam Tej Bro Movie Shoot Experience

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. జూలై 28న ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమా 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటున్నారు.

Read Also: Samantha : మంకీతో సెల్ఫీ దిగుతున్న సమంత..

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్‌ కలుపుకొని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 97 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నారు. కాబట్టి… బాక్సాఫీస్ దగ్గర 98 కోట్లకు పైగా రాబడితే బ్రో బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఈ లెక్కన దాదాపు 100 కోట్ల టార్గెట్‌తో బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోందని చెప్పొచ్చు. పవర్ స్టార్ క్రేజ్ ముందు ఈ టార్గెట్ చిన్నదే అయినా ప్రస్తుత పరిస్థితులు బ్రోకి అనుకూలంగా లేవు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. బ్రో మూవీకి భారీ వర్షాలు గట్టి ఎదురుదెబ్బ తీసే అవకాశం ఉందంటున్నారు. పైగా టికెట్ రేట్లు కూడా పెరగలేదు, అదనపు షోస్ కూడా లేవంటున్నారు. కాబట్టి.. బ్రో బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం.

Exit mobile version