Pawan Kalyan: ‘బ్రో’ టార్గెట్ 100 కోట్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లోకి వస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇదే. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో బ్రో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అందుకే బ్రో మూవీ పై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. జూలై 28న ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో సినిమా 80 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటున్నారు.
Read Also: Samantha : మంకీతో సెల్ఫీ దిగుతున్న సమంత..
Also Read
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
- OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
- Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
- Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 97 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటున్నారు. కాబట్టి… బాక్సాఫీస్ దగ్గర 98 కోట్లకు పైగా రాబడితే బ్రో బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఈ లెక్కన దాదాపు 100 కోట్ల టార్గెట్‌తో బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోందని చెప్పొచ్చు. పవర్ స్టార్ క్రేజ్ ముందు ఈ టార్గెట్ చిన్నదే అయినా ప్రస్తుత పరిస్థితులు బ్రోకి అనుకూలంగా లేవు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. బ్రో మూవీకి భారీ వర్షాలు గట్టి ఎదురుదెబ్బ తీసే అవకాశం ఉందంటున్నారు. పైగా టికెట్ రేట్లు కూడా పెరగలేదు, అదనపు షోస్ కూడా లేవంటున్నారు. కాబట్టి.. బ్రో బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం.
తాజావార్తలు
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!