Waltair Veerayya: మెగా మాస్ జాతర మొదలైయిపోయింది. వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇంకేంటి మెగా అభిమానులతో వైజాగ్ మాపొత్తం నిండిపోయింది. ఇక సాధారణంగా ఏ ఈవెంట్ జరిగినా అభిమానుల్లో వినిపించే ఒకే ఒక మాట.. పవన్ కళ్యాణ్.. ఈ ఒక్క మాట వింటే చాలు అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఇక మెగా ఈవెంట్ లో అయితే ఈవెంట్ మొదలయ్యినప్పటి నుంచి ఎండ్ అయ్యేవరకు పవన్ నమ జపం చేస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఇదే విషయమై అల్లు అర్జున్ పవన్ అభిమానులపై ఫైర్ అయిన విషయం కూడా విదితమే.. మా ఫంక్షన్స్ లో మీ వాళ్ళ గోలేంటి బ్రదర్ అని అడుగుతున్నారని, మెగా ఈవెంట్స్ లో అరవండి కానీ వేరేవాళ్ళ ఫంక్షన్స్ లో మాత్రం సైలెంట్ గా ఉండాలని తన పద్దతిలో చెప్పుకొచ్చి పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాడు. అప్పట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఇక అభిమానం అలాంటివాటిని పట్టించుకోదు అని తెల్సిందే. తాజాగా వాల్తేరు వీరయ్య ఈవెంట్ లో అన్న చిరు కన్నా తమ్ముడు పవన్ క్రేజ్ ను చూస్తే మెంటల్ ఎక్కేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సీఎం.. పవన్.. సీఎం అంటూఫ్యాన్స్ అరిచే అరుపులతో కాలేజ్ గ్రౌండ్ దద్దరిల్లిపోతోంది. ఇక అదే క్రేజ్ తో ఈవెంట్ ను కొనసాగిస్తోంది సుమ. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ ను గుర్తుచేసి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇక ఈ ఈవెంట్ లో చిరు స్పీచ్ పైనే అందరి చూపు ఉంది. పవన్ గురించి విశాఖలో చిరు ఏమైనా మాట్లాడతాడా..? పవన్ రాజకీయాల గురించి టాపిక్ వస్తుందా..? తమ్ముడు కు అండగా నిలుస్తాడా..? అని ఒకటే చర్చ జరుగుతోంది. మరి అన్న ఫంక్షన్ లో తమ్ముడి గురించి ఏం మాట్లాడుతాడో చూడాలంటే కొద్దిసేపు ఆగాల్సిందే.