గత కొన్ని రోజులుగా ఏ ఛానెల్ చూసినా, ఏ వెబ్ సైట్ చూసినా నరేష్, పవిత్రా లోకేష్ పేర్లే వినిపిస్తున్నాయి. ఈ జంట గత కొన్ని రోజులుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక మధ్యలో నరేష్ మూడో భార్య నా భర్త నాకు విడాకులు ఇవ్వలేదు.. వేరే పెళ్లి ఎలా చేసుకుంటాడు అంటూ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడంతో ఈ విషయం ఇంకా సంచలనం గా మారింది. ఇక ఈ వార్తలపై నరేష్ ఇటీవలే స్పందించి పవిత్రా లోకేష్ నాకు మంచి స్నేహితురాలు మాత్రమే.. ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్, మెంటర్, ఫిలాసఫర్ అని చెప్పుకొచ్చాడు. అయినా ఈ రూమర్స్ ఆగలేదు.
Read Also: Naresh: పవిత్రా లోకేష్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం అదే..!
మరోపక్క పవిత్రా లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ లైన్లోకి వచ్చి పవిత్రకు మోసం చేయడం అలవాటే.. ఆమెకు, నరేష్ కు మధ్య ఉన్న సంబంధం నిజమే అంటూ ఛానెల్ లైవ్ లో మాట్లాడి మరింత హీట్ పెంచాడు. ఇక తాజాగా వీటి అన్నింటికి పవిత్రా లోకేష్ సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ” నరేష్ చాలా మంచివాడు.. జెంటిల్ మెన్. సమ్మోహనం సినిమా షూటింగ్ సమయంలో అతడు డల్ గా కనిపించడం చూసి నేను ఏమయ్యిందని అడిగాను.. తన జీవితాల్లో జరిగిన సంఘటనలు అన్నీ చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి అతడిపై నాకు ఒక గౌరవం ఏర్పడింది. అతడికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పాను. అతడితో సమయం గడుపుతున్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. ఆయన వ్యాపార లావాదేవీలు ఆయన చూసుకుంటారు.. నా పని నేను చేసుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అయితే ఇదే..పెళ్లి గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ విషయంలో మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.