సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటి పవిత్రా లోకేష్ ను నరేష్ నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీంతో నరేష్ ఈ వార్తలు అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. బెంగుళూరు వెళ్లిన నరేష్ అక్కడ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవిత్రా లోకేష్ కు తనకు ఉన్న సంబంధం బయటపెట్టారు.
“గత కొన్నిరోజుల నుంచి మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. వాటిని హైలైట్ చేస్తూ రమ్య మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తోంది. ఆమె చెప్పేవన్నీ అబద్దాలు.. మీడియా ముందు తనను తాను గొప్ప చేసుకోవడానికి నన్ను బ్లేమ్ చేస్తోంది. ఆమె ఆగడాల గురించి చెప్పడానికి నాకు నోరు కూడా రావడం లేదు. పవిత్రా లోకేష్ ను టార్గెట్ చేసి నన్ను సాధించాలని చూస్తోంది. పవిత్ర నాకు ఐదేళ్లుగా తెలుసు.. హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ లో ఆమె పరిచయమైంది. ఆమె ఎక్కువ మాట్లాడదు.. చాలా సైలెంట్ పర్సన్.. ఎవరితో ఎక్కువగా కలవదు.. ఆ తరువాత సమ్మోహనం సినిమా చేసినప్పుడు నా పరిస్థితి తెలిసి..మాట్లాడింది.. అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మంచి స్నేహితులమయ్యాం. నేను మగాడిని మాత్రమే కాదు మనిషిని.. నాక్కూడా ప్రేమ కావాలి.. నాతో ఎవరు మాట్లాడతారో వారితో నాక్కూడా మాట్లాడాలని ఉండేది.
సమ్మోహనం సినిమా షూటింగ్ లో మేము క్లోజ్ అయ్యాం. మా ఇద్దరికీ ఒకేరకమైన అభిరుచులు, ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. నేను గర్వంగా చెప్తున్నాను.. తను నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేదీ లేదు.. ఒకే ఫంక్షన్ లో కనిపించాం.. ఒకే గుడికి వెళ్ళాం అంటే.. ఇది 2022.. స్నేహితులు బయటికి వెళ్ళకూడదా..? ఆమె ఎంతో బాగా మాట్లాడుతోంది. ఆమెను అడ్డుపెట్టుకొని రమ్య ఫేమస్ అవ్వాలని చూస్తోంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.