Dhanush: హమ్మయ్య ఎట్టకేలకు ధనుష్ వారి కొడుకే.. తేల్చేసిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కుమారుడే అని న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయ్యింది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాము జీవించడానికి నెలకు రూ 65 వేలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ధనుష్ మాత్రం వారు తమ అమ్మానాన్న కాదని, తన తల్లిదండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి అని, తన నుంచి డబ్బులు రాబట్టేందుకే తప్పుడు కేసు పెట్టారని ధనుష్ కూడా చెప్తూ వచ్చాడు. ఇలా 9 ఏళ్లుగా ఈ కేసు నడుస్తూనే ఉంది.
ఇక తాజాగా ఈ కేసును కోర్టు కొట్టివేసింది. కదిరేశన్, మీనాక్షి చూపించిన ఆధారాలు సరైనవి కాదని తేల్చి చెప్పింది. గతంలో వారు కోర్టుకు అందించిన పిటిషన్ లో ధనుష్ కు ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల గురించి రాయడంతో.. ధనుష్ ను చెక్ చేయడానికి కోర్టు అనుమతించింది. ఇక ఈ మధ్యనే కోర్టు రిజిస్టార్ సమక్షంలో మేలూర్ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్ ధనుష్ పుట్టుమచ్చలను చెక్ చేసి..అతని ఒంటిపై ఎలాంటి పుట్టుమచ్చలు లేవని తెలిపాడు. దీంతో కోర్టు.. కదిరేశన్, మీనాక్షి చెప్తున్న మాటలో నిజం లేదని తెలుపుతూ.. ఈ కేసును కొట్టివేసింది. ధనుష్.. కస్తూరి రాజా, విజయలక్ష్మి కొడుకే అని చెప్పుకొచ్చింది. ఇక ఈ కోర్టు తీర్పుతో ధనుష్ కు ఊరట లభించింది. మరి ఈ తీర్పుతో కదిరేశన్, మీనాక్షి జంట ఆగిపోతారో.. పై కోర్టులో కేసు వేస్తారో చూడాలి.
Also Read
- Ramayana : లాస్ ఏంజెల్స్‌లో 'రామాయణ' ట్రైలర్ లాంచ్
- Akhil Raj: "డెలివరీ బాయ్‌ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
- Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్‌లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!