Parineetichopra : స్టార్ హీరోయిన్ తల్లి అయింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఆమెనే నండి పరిణీతి చోప్రా. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పరిణీతికి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె గతేడాది ఆప్ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు తాజాగా మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తాజాగా ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ రోజు మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి.
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో నటించను.. కిరణ్ అబ్బవరం కామెంట్స్
మొత్తానికి మా బేబీ బాయ్ వచ్చేశాడు. ఈ రోజు కోసమే మేము వెయిట్ చేస్తున్నాం. అతన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వెయిట్ చేయలేకపోతున్నాం. మీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ తెలిపింది ఈ జంట. దీంతో నెటిజన్లు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు. ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికా నుంచి ఇండియా బయలుదేరినట్టు తెలుస్తోంది. తన చెల్లెలు కొడుకు పుట్టాడని తెలిసి తెగ సంతోషపడుతోందంట. ప్రియాంకకు పాప ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్లుగా ఎదిగారు.
Read Also : Bigg Boss 9 : నాగార్జున చేసిన పనికి ఏడ్చేసిన కంటెస్టెంట్లు
