ఐదు వేరు వేరు కథలతో ఆంథాలజీ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పంచతంత్ర కథలు’. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన `మోతెవరి` సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో చార్ట్ బస్టర్‌గా నిలిచిందని నిర్మాత తెలిపారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”ఈ ఆంథాలజీలో ఐదు వేరు వేరు కథలు.. వేరు వేరు జోనర్లలో రావడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. అన్నింటిని మించి మా ఫ్యామిలీ మెంబర్ నోయెల్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను” అని అన్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిందని, త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత మధు తెలిపారు.